దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలు మోపింది. పేలుడుకు ముందు పాకిస్తాన్‌లో మాలిక్ సోదరుల శిక్షణ పొందినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. దర్బంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలుడు తర్వాత నేపాల్ ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు కుట్ర చేసినట్లు తేల్పింది జాతీయ దర్యాప్తు సంస్థ.
వాయిస్-దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్‌లో శిక్షణ పొంది వచ్చిన నాసిర్ మాలిక్ సోదరులే దర్భంగా పేలుళ్లకు సూత్రధారులు అని తేల్చింది. దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు జరిగిన తర్వాత నేపాల్-పాకిస్థాన్ పారిపోవాలని ప్లాన్ చేసినట్లుగా గుర్తించింది. దర్భంగా పేలుళ్ల కేసులో 5 గురిపై అభియోగాలు మోపింది. ఈ ఐదుగురికి సంబంధించిన ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.
వాయిస్-పాట్నాలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది ఎన్‌ఐఏ. మహమ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్‌లను నిందితులుగా పేర్కొంది. జూన్ 17న దర్భంగా రైల్వే స్టేషన్‌లో పేలుడు జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత అదే నెల 24న కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది.
వాయిస్-ఇక..కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు పేలుళ్ల ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందని తేల్చారు. పాకిస్థాన్‌లో ఉంటూ లష్కరే తోయిబా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు రైల్లో బాంబు పేల్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో స్పష్టంచేసింది. ఈమేరకు నసీర్ ఖాన్ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారు చేయడంలో శిక్షణ పొందాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్‌తో కలిసి హబీబ్ నగర్‌లో చీరల వ్యాపారం పేరుతో నివాసం ఉన్నారు.
వాయిస్-పాకిస్థాన్ నుంచి పలుమార్లు నసీర్ ఖాన్‌కు నిధులు కూడా వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుళ్ల కోసం చీరల మూటలో బాంబు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో చీరల పార్శిల్ పంపించారు. కదులుతున్న రైల్లో బాంబు పేలి మంటలు అంటుకొని తీవ్ర ప్రాణనష్టం కలిగేలా చేయాలని లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పేలుళ్ల తర్వాత నిందితులు నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. పకడ్బందీగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దర్భంగా పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన నాసిర్ మాలిక్ సోదరులే పేలుళ్లకు సూత్రధారులను ఎన్ఐఏ తెలిపింది. ఈకేసులో మరి కొంతమంది అనుమానితులు ఉన్నారని వారికి సంబంధించి విచారణ కొనసాగుతోందని దర్యాప్తు సంస్థ కోర్టుకు వెల్లడించింది.