Love Marriage: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర తాలూకాలోని మైలపనహళ్లి గ్రామానికి చెందిన ఫాసియా, నాగార్జున ఒకరినొకరు రెండేళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి మరి మార్చి 23వ తేదీన పోలీసుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ 15 రోజుల పాటు కాపురం చేసిన తర్వాత.. ఆ అమ్మాయి, తన భర్తకి ఊహించని షాక్ ఇచ్చింది.
Read Also: AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!
అయితే, ఈ ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోగా.. యువకుడి ఫ్యామిలీ అంగీకరించింది. ఇక, వీరి సంసార జీవితం ఓ 15 రోజుల పాటు గడిచిందో లేదో ఫాసియా తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. తాను మతాంతర వివాహం చేసుకోవడంతో తన తల్లి ఆరోగ్యం దెబ్బతింది, ఇక మా పుట్టింటికి వెళ్లిపోతానని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపి ఆమె వెళ్లిపోయింది. ఇక, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, తనతో కలిసి నిండు నూరేళ్లు ఉంటానని చెప్పి.. ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్లిపోవడంతో నాగార్జున ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.