AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీల భన్సాలీ, అట్లీ పేర్లు పించాయి వినిపించాయి. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో సినిమాను నేడు అధికారంగా ప్రకటించారు.
Also Read
కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అల్లు అర్జున్, అట్లీ సినిమాను నిర్మిస్తోంది. అందుకు సంబంధించి కాసేపటి క్రితం వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు అట్లీ ఈ సినిమా కోసం అమెరికా పయనమయ్యారు. హాలీవుడ్ సినిమాలైన స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ ను కలిసి బన్నీ లుక్ టెస్ట్ నిర్వహించారు. ఆ విజువల్స్, థీమ్ చూస్తుంటే ఇదేదో హాలీవుడ్ సినిమాను ధీటుగా ఉంది. అందరూ అనుకున్నట్టుగా బన్నీ ఈ సారి పాన్ ఇండియా సినిమా కాదు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడని అనిపిస్తోంది. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంబంధించి ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే సెన్సేషన్ కు తెరలేపారనే చెప్పాలి.
- Tags
- A6
- AA22
- alluarjun
- Atlee
- SunPictures
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!