USA: రోడ్డుపై జరిగిన చిన్న వివాదం ఓ భారతీయ యువకుడి హత్యకు కారణమైంది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల గవిన్ దసౌర్‌గా గుర్తించారు. మరణించిన వ్యక్తికి కేవలం రెండు వారాల క్రితమే వివాహం జరిగింది. తన మెక్సికన్ భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో, ఇండీ నగరంలోని ఓ జంక్షన్ వద్ద జరిగిన వాగ్వాదంలో నిందితుడు అతడిని కాల్చి చంపారు.
Read Also: Mechanic Rocky: ఆ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్
దసౌర్ ఆగ్రాకు చెందినవారు. అతను వివియాన జమోరా అనే అమ్మాయిని జూన్ 29న పెళ్లి చేసుకున్నాడు. రెండు వారాలు గడవక ముందే అతడిని నిందితులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దసౌర్ జంక్షన్ వద్ద తన కారు నుంచి దిగి పికప్ ట్రక్ డ్రైవర్‌పై అరుస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత తన చేతిలోని తుపాకీతో ట్రక్కు డోర్‌ని పగలగొట్టాడు. ఆ తర్వాత పికప్ ట్రక్ డ్రైవర్ ప్రతిస్పందనగా అతని కాల్చడం కనిపిస్తుంది. దసౌర్‌ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
తీవ్ర రక్తస్రావం జరుగుతున్న సమయంలో దసౌర్‌ని తాను పట్టుకున్నానని, అంబులెన్స్ కోసం ఎదురు చూసినట్లు బాధితుడి భార్య వివియానా జమోరా పోలీసులకు చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆత్మరక్షణ కోసం అతను అలా ప్రవర్తించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
https://twitter.com/ManyFaces_Death/status/1814057754572829162