NTV Telugu Site icon

Farmers Suicide: కర్ణాటకలో 15 నెలల్లో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య.. కారణమిదే

Farmers Sucide

Farmers Sucide

కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది. కర్ణాటకలో అత్యధికంగా బెలగావి, హవేరి మరియు ధార్వాడ్‌లోని మూడు జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బెలగావిలో 122, హవేరిలో 120, ధార్వాడ్ లో 101 మంది సూసైడ్ చేసుకున్నారు.

Read Also: PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం

మరోవైపు.. చిక్కమగళూరులో 89 మంది, కలబుర్గిలో 69 మంది, యాదగిరిలో 68 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నాటకలోని 27 జిల్లాల్లో 6 జిల్లాల్లో రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారు సింగిల్ డిజిట్ లో నమోదు కాగా.. మిగిలిన 21 జిల్లాల్లో 30 లేదా అంతకంటే ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిక్కబళ్లాపూర్‌, చామరాజ్‌నగర్‌లో రెండేసి రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.

Read Also: Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్

గత సెప్టెంబరు నెలలో కర్నాటకలోని చెరకు అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల (APMC) మంత్రి శివానంద్ పాటిల్, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. పంట నష్టాలు, రుణాలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ఈ పరిహారం చెల్లించాలని కోరుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే.. పాటిల్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘సొంత కారణాలతో’ ఆత్మహత్య చేసుకున్న వారిని రైతులు అని పిలవలేమని అన్నారు.