National Herald Case: ముగిసిన సోనియాగాంధీ తొలి రోజు విచారణ..75 మంది కాంగ్రెస్ ఎంపీల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రశ్నించింది. గతంలోనే సోనియా గాంధీకి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా.. కరోనా బారిన పడిన కారణంగా ఆ సమయంలో సోనియా గాంధీ హాజరుకాలేదు. తాజాగా గురువారం రోజున ఈడీ సోనియాగాంధీని 3 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. సోనియా గాాంధీని దాదాపుగా 25కు పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ నెల 25న సోమవారం ఈడీ ముందు హాజరుకావాలని సోనియా గాంధీని అధికారులు ఆదేశించారు.
సోనియాగాంధీని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. పలు చోట్ల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానెన్లను ఉపయోగించారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కార్యకర్తలను పోలీసుల అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, పీ. చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్ చౌదరి, మాణిక్కం ఠాగూర్, కే. సురేష్, హరీష్ రావత్, శశి థరూర్ మొదలైన వారిని అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. మొత్తం 75 మంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో కూడా అక్కడి పీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
Read Also: Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించింది ఈడీ. దాదాపుగా 50 గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించింది. అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్ లను ఈడీ ఇప్పటికే విచారించింది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!