Delhi rain: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
- ఢిల్లీలో మరోసారి భారీ వర్షం
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం
- గత రెండ్రోజుల్లో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గత రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు జరిగించని పరిస్థితులు ఏర్పాడ్డాయి. సామాన్యుల నుంచి మంత్రులు, ఎంపీల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 88 ఏళ్లలో కురిసిన వర్షం.. తిరిగి గత రెండ్రోజుల్లో కురిసి రికార్డ్ సృష్టించింది. కేంద్ర వాతావరణ శాఖ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. దాదాపు 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లుగా ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విద్యుత్ షాక్.. గోడ కూలి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హస్తిన వాసులు తిరిగి కోలుకుంటుండగా.. మరోసారి శనివారం మధ్యాహ్నం నుంచి పలుచోట్లు భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు నిలిచిపోవడం వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Instagram Down: ఒక్కసారిగా నిలిచి పోయిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు! అసలేం జరిగింది?
Also Read
మాన్‌సింగ్ రోడ్, శాస్త్రి భవన్, ఫిరోజ్ షో రోడ్డులో భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. గత కొద్ది రోజులుగా వేడి గాలులతో.. నీటి ఎద్దడితో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా విస్తారంగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు చల్లని గాలులతో ఉపశమనం పొందుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Meera Nandan: గుడిలో ప్రియుడిని పెళ్లాడిన తెలుగు హీరోయిన్
#WATCH | National Capital, Delhi receives fresh spell of rain. Visuals from the Feroz Shah road. pic.twitter.com/6o80xAoxnr
— ANI (@ANI) June 29, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!