NTV Telugu Site icon

Parliament Session: మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌.. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం..!

Parlament

Parlament

Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. గత సెషన్‌లో నీట్ వివాదం కారణంగా పార్లమెంటులో చాలా గందరగోళం ఏర్పడింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరిగిన ఈ సెషన్ ప్రారంభంలో.. కొత్త ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Read Also: Jio Annual Packs: ఇకనుంచి రెండు వార్షిక ప్లాన్స్ మాత్రమే.. ప్రయోజనాల్లోనూ మార్పులు!

కాగా, వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. ఈ సెషన్ జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. జూలై 23వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ 3.0పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. సామాన్య ప్రజలకు ఆదాయపు పన్నులో మినహాయింపును ఆశిస్తున్నారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు 2024 బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. జూలై 23వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.