West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్

  • నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్
  • పాత హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు
  • మమత బెనర్జీ మద్దతు తెలిపిన గంటల్లోనే కీలక పరిణామం
West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు.

ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి సంచిత ప్రధాన్ డే పోటీ నుంచి విమరించుకుంటున్నట్లు ప్రకటించారు. సీఎం సువేందు అధికారితో సమావేశమైన గంటల్లోనే ఆమె నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది మమతా బెనర్జీకి బిగ్ షాక్‌గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఇదిలా ఉంటే, బెంగాల్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మమత మద్దతు ఇచ్చిన గంటల్లోనే ఇది జరిగింది. పాత హత్య కేసుకు సంబంధించిన ఆరోపణల్లో ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు. మమత మద్దతుపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఆమెను మేము మద్దతు కోరలేదని, ఆమె నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పారు.