Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Name Change Of Nehru Museum

Delhi: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు..

Published Date :August 17, 2023 , 7:32 am
By Naga Maneendra
Delhi: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi: పేరు మార్పులపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇపుడు రాజధాని న్యూఢిల్లీలో తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌) పేరును మార్చారు. ఇకపై ఈ మ్యూజియం ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సోసైటీ(పీఎంఎంఎల్‌) పేరుతో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌.. అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ మండిపడగా, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌) పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వివాదం రేగింది. ‘‘నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయని పీఎంఎంల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్యప్రకాశ్‌ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. ఆ తరువాత 1966, ఏప్రిల్‌1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

Read also: Dhana Lakshmi Stotram: మీ ఇంట ధాన్యసిరులు కురిపించే ధాన్యలక్ష్మీ “పసుపుకొమ్ముల అర్చన”

మాజీ ప్రధాని కాంగ్రెస్‌ అధినాయకుడు పండిట్‌ జవహార్ లాల్‌ నెహ్రూ వారసత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే ప్రధాని మోడీ ఎజెండా అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని మోడీ అభద్రతా భావం, భయాందోళనల మధ్య నెహ్రూ మ్యూజియం పేరు మార్చారు. నెహ్రూ వారసత్వాన్ని విధ్వంసం చేయాలని ఆయన భావిస్తున్నారు. మ్యూజియం పేరులో ఎన్‌ స్థానంలో పీ అని మార్చారు. అందులో ‘‘పీ’’ అంటే చిన్నతనం, ఇబ్బంది పెట్టడం’’ అని జైరామ్‌ రమేష్‌ పేర్కొన్నారు. నెహ్రూ పేరు మార్చినంత మాత్రాన స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్రను, భారత్‌ను లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆయన నడిపించిన విధానాన్ని చెరిపేయలేరని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేసింది. దేశాని ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరి ఘనతలు ప్రపంచానికి చాటి చెప్పడానికే మ్యూజియం పేరుని మార్చినట్టు స్పష్టం చేసింది. లాల్‌బహదూర్‌ శాస్త్రి, పీ.వీ.నరసింహారావు, హెచ్‌.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ఇలా ఎందరో భారత దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, ఈ మ్యూజియం ఏ ఒక్కరికో, ఒక కుటుంబానికో చెందినది కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాన మంత్రులకు గౌరవంగా ఉండటం కోసమే పేరు మార్చినట్టు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi
  • NMML
  • people
  • Prime Ministers' Museum
  • Renamed

తాజావార్తలు

  • Israel-Lebanon: లెబనాన్‌‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

  • Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

  • Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions