NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- NALSAR వివాదం నేపథ్యంలో BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణలు.
- దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యార్థులకు ఆయన విచారం వ్యక్తం చేశారు.
- తన వ్యాఖ్యలు లేదా లేఖ వల్ల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే సారీ అన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NALSAR Row: దేశవ్యాప్తంగా నల్సార్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. న్యాయ విద్యార్థుల కాన్వొకేషన్‌కు సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై వివాదం మొదలైంది. కొందరు విద్యార్థులు దీనిపై అభ్యంతరం తెలిపారు. 2026లో న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులను అడ్వొకేట్లుగా ఎన్రోల్ చేయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తాత్కాలికంగా ఆదేశించింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో దీనిని విరమించుకుంది.
చివరకు ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ కూడా బీసీఐ తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి సంబంధించి తాను చేసిన ప్రకటనలు లేదా జారీ చేసిన ఏవైనా లేఖల ద్వారా న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసినందుకు మిశ్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రస్తుత వివాదానికి సంబంధించి, తన మాటల ద్వారా గానీ, లేఖల ద్వారా గానీ న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు తాను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెబుతున్నానని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
విచారం వ్యక్తం చేయడం లేదా క్షమాపణ చెప్పడం అనేది ప్రతిష్టకు లేదా అహంకారానికి సంబంధించిన విషయం కాదని ఆయన పేర్కొన్నారు. మన విద్యార్థుల భావాలు, ఆందోళనలు మనకు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. ఈ క్షమాపణతో, విద్యార్థులతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించాలని ఆయన ఆశిస్తున్నారు.
నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. 2026 కాన్వొకేషన్‌కు CJI జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరారు. యువతను బొద్దింకలుగా పోల్చడాన్ని, జంతర్ మంతర్ నిరసలన సమయంలో పోలీసులు చర్యలు చూసేందుకు సమయం లేదని చెప్పడంపై సీజేఐ తీరును తప్పుబడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!