NTV Telugu Site icon

Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని

Rajivgandhi Assassination

Rajivgandhi Assassination

Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు.

దీంతో ఈ కేసులో దోషులుగా ఉన్న నళిని, రవిచంద్రన్‌ కూడా తమకు ఉపశమనం కలిగించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉంది. నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు

హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన ఏజీ పేరారివాలన్‌ను విడుదల చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మే 18న సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాలను కల్పించింది. పెరారివాలన్ విడుదలైన తర్వాత, రవిచంద్రన్, అతనితో సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు లేఖ పంపారు. గవర్నర్ విడుదల ఫైళ్లను మూడేళ్లుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంచారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. సెప్టెంబరు 2018లో తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ఆధారంగా జైలు నుండి ముందస్తు విడుదల కోసం పెరారివాలన్ చేసిన అభ్యర్థనను నిర్ణయిస్తూ, అత్యున్నత న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది, మరో ఆరుగురు దోషులు జైలులోనే ఉన్నారు. హైకోర్టు ఆదేశంపై రవిచంద్రన్ తన అప్పీల్‌లో పెరారివాలన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉదహరించారు. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళా మానవబాంబుగా మారడంతో రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డారు.

Show comments