Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!
- మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో అమానుషం
- 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం
- విడిపించిన పోలీసులు.. తల్లిదండ్రులపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’’ అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చెడు అలవాట్లకు గురి కాకుండా చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్చించాలని అంటారు. అవి జీవితాంతం తోడుంటాయని చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు క్రమశిక్షణ పెట్టకుండా పెద్దయ్యాక బుద్ధులు నేర్పించకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 12 ఏళ్ల కొడుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు అమానుష చర్యకు పాల్పడ్డారు. సంకెళ్లతో బంధించి దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: అభయారణ్యంలో కాల్పుల మోత.. 14 మంది మావోయిస్టులు హతం
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు దినసరి కూలీలు. 12 ఏళ్ల కొడుకు స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లరి పిల్లాడిగా మారడమే కాకుండా ఇళ్లల్లో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో బిడ్డను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠిన చర్యలకు దిగారు. ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లే ముందు కొడుకును స్తంభానికి సంకెళ్లు వేసి వెళ్లిపోయేవారు. దీంతో పిల్లాడు ఆకలితో అల్లాడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదు.. అన్ని మతాలను గౌరవిస్తాం
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొలుసులతో బంధించిన బాలుడిని విడిపించారు. ఈ క్రమంలో బాలుడు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా కనిపెట్టారు. బాలుడి కాళ్లు, చేతులకు గాయాలైనట్లుగా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి కార్యాలయం బృందం గుర్తించింది. వెంటనే బాలుడికి చికిత్స అందించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. తల్లిదండ్రులు గత 2 నెలలుగా ఇలా చేసినట్లుగా గుర్తించారు. మాట వినడం లేదని.. అల్లరి చిల్లరగా తిరగడమే కాకుండా ఫోన్లు దొంగిలించడంతోనే బంధించినట్లుగా తల్లిదండ్రులు చెప్పారు. తరచుగా ఇంట్లో నుంచి పారిపోతున్నాడనే గొలుసులతో బంధించినట్లు తెలిపారు.
తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి పంపారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ సంఘటన గురించి పోలీసులకు రెండుసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. స్థానికులు చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ (1098)కు సమాచారాన్ని అందించగా రెస్క్యూ బృందం వెంటనే చర్యలు తీసుకుందని వెల్లడించారు. పిల్లల పట్ల ఏ విధమైనా వేధింపులు, హింస గమనించినట్లయితే వెంటనే పిల్లల రక్షణ వ్యవస్థకు లేదా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!