Site icon NTV Telugu

Bihar: ఎన్నికల ముందు బీహార్‌ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్

Muton

Muton

బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరాకటంలో పడేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా మటన్ పాలిటిక్స్ రాష్ట్రంలో హీటెక్కిస్తోంది.

ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం

ప్రస్తుతం దేశంలో శ్రావణమాసం నడుస్తోంది. అయితే శ్రావణమాసంలో హిందువులు నాన్‌వెజ్ తినరు. కానీ సోమవారం ఎన్డీఏ సమావేశంలో నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. పాట్నాలోని అసెంబ్లీలో జరిగిన విందు వంటకాల్లో మటన్ లేబుల్ కనిపించింది. దీంతో శ్రావణమాసంలో మటన్ ఆరగించడమేంటి? అని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులను విమర్శిస్తారు కానీ.. తమ విషయంలో మాత్రం సనాతన ధర్మం పాటించారా? అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య

మటన్ తిన్నవారిలో మోడీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని.. శ్రావణమాసంలో రోజుకు 3 కిలోల మటన్ తింటారని.. కానీ ఇతరులకు సనాతన ధర్మం గురించి బోధిస్తారంటూ ఎద్దేవా చేశారు. తినే ఆహారంపై తమకు అభ్యంతరం లేదు గానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శిస్తారంటూ ధ్వజమెత్తారు.

2023 శ్రావణ మాసంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ భోజనం ఆతిథ్యం ఇచ్చారు. ఆనాటి దృశ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.

 

Exit mobile version