Site icon NTV Telugu

Ram Mandir: పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అయోధ్యకు పవిత్ర జలం.. పంపింది ఓ ముస్లిం వ్యక్తి..

Pok Water

Pok Water

Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్‌కి రాలేదు. పుల్వామా అటాక్స్ తర్వాత భారత్ బాలాకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తపాలా సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పవిత్ర జాలాలను యూకే ద్వారా అయోధ్యకు వచ్చినట్లు సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ (SSCK) వ్యవస్థాపకుడు రవీందర్ పండిత చెప్పారు.

Read Also: Rashmika Mandanna deepfake: ఇన్‌స్టాలో ఫాలోవర్లను పెంచుకునేందుకే రష్మిక వీడియో..

పీఓకేలో ఉన్న పవిత్ర శారదా పీఠ్‌ కుండ్ నుంచి ఈ జలాలను సేకరించారు. ఈ జలాలను సేకరించింది తన్వీర్ అహ్మద్ అనే ముస్లిం వ్యక్తి. ఈ నీటిని అక్కడి నుంచి యూకేలో ఉన్న అతని కుమార్తె మఘ్రీబీకి పంపించారు. మఘ్రిబీ, ఆగస్ట్ 2023లో భారతదేశంలోని అహ్మదాబాద్‌కు వచ్చి కాశ్మీరీ పండిత్ కార్యకర్త సోనాల్ షేర్‌కి అందించారు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకున్నాయి. 1947 తర్వాత శారదా పీఠం పీఓకేలోకి వెళ్లిపోయింది.

Exit mobile version