మసీదులో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ రాజకీయ సమావేశం నిర్వహించారు. అయితే డింపుల్ యాదవ్ వేసుకున్న వస్త్రాలు తీవ్ర దుమారం రేపాయి. ఇస్లాం ఆచారాలకు తగినట్టుగా వస్త్రధారణ లేదని ముస్లిం సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డింపుల్ యాదవ్ బ్లౌజ్ ధరించారు. ఆమె వీపు, పొట్ట కనిపిస్తోందని, డింపుల్ తలపై దుపట్టా కూడా లేదని మత పెద్ద మౌలానా సాజిద్ రషీది అన్నారు. ఇది మసీదు ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ మనోభావాలను దెబ్బతీస్తుందని గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహాదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
తాజాగా మౌలానా సాజిద్ రషీది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వరం పెంచారు.. డింపుల్ యాదవ్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులకు మసీదు స్థలం మర్యాద గురించి తెలిసి ఉండాలన్నారు. అయినా తాను చెడ్డ పదం వాడలేదని.. తలలు కప్పుకుని తిరగాలని మాత్రమే చెప్పానన్నారు. మసీదుకు వస్త్రధారణ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయని, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ దానిని విస్మరించారన్నారు. డింపుల్ యాదవ్ చీరలో ఉన్న కూడా వీపు భాగం కనిపించిందన్నారు. మరో మహిళ, సమాజ్‌వాదీ ఎంపీ ఇక్రా హసన్ తలను కప్పుకుని ఉన్నారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పడానికి బదులుగా తనను బెదిరిస్తున్నారని రషీది వాపోయారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ చేరుకున్న నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు.. విడిచిపెట్టాలని కుమార్తె వేడుకోలు
మతాధికారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 79 (మహిళల మర్యాదను కించపరచడం), 196 (సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 299 (మతపరమైన భావాలను కించపరచడం), మరియు 352 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Sofiya Qureshi: విజయ్ షాకు ఊరట.. సోఫియా ఖురేషి కేసులో సుప్రీంకోర్టులో ఉపశమనం