Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim board slams SRK’s Pathaan: వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేకుంటే సినిమాను బ్యాన్ చేస్తామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరిక పంపారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా సినిమాపై అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇదిలా ఉంటే ప్రస్తుతం ముస్లిం బోర్డు కూడా అభ్యంతర వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు కూడా బేషరమ్ రంగ్ పాటలో అసభ్యత ఎక్కువగా ఉందని.. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాను విడుదల చేయవద్దని బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ కోరారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల గురించి మాకు కాల్స్ వస్తున్నాయని, దీనిపై పలువురు ఫిర్యాదు చేశారని, ఇస్లాం మతాన్ని తప్పుడు విధానంతో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా తీశారు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ సయ్యద్ అనాస్ అలీ మండిపడ్డారు.
ఈ సినిమాపై ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ సినిమాను బహిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను చూడవద్దని మేము ప్రజలను, యువకులకు విజ్ఞప్తి చేశారు. ఇస్లాం మతంపై రాజీపడకపోవడం మన హక్కు అని .. ఎవరైనా ఇస్లాం గురించి తప్పుగా చూపిస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సినిమా తప్పుడు సందేశం పంపించడంతో పాటు శాంతికి భంగం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ సినిమాతో ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. పఠాన్‌లు ఎంతో గౌరవించబడే సమాజం అయితే వారిని చాలా తప్పుగా చిత్రీకరించారని అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!