NTV Telugu Site icon

Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం

Phataan

Phataan

Muslim board slams SRK’s Pathaan: వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేకుంటే సినిమాను బ్యాన్ చేస్తామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరిక పంపారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా సినిమాపై అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇదిలా ఉంటే ప్రస్తుతం ముస్లిం బోర్డు కూడా అభ్యంతర వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు కూడా బేషరమ్ రంగ్ పాటలో అసభ్యత ఎక్కువగా ఉందని.. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాను విడుదల చేయవద్దని బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ కోరారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల గురించి మాకు కాల్స్ వస్తున్నాయని, దీనిపై పలువురు ఫిర్యాదు చేశారని, ఇస్లాం మతాన్ని తప్పుడు విధానంతో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా తీశారు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ సయ్యద్ అనాస్ అలీ మండిపడ్డారు.

ఈ సినిమాపై ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ సినిమాను బహిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను చూడవద్దని మేము ప్రజలను, యువకులకు విజ్ఞప్తి చేశారు. ఇస్లాం మతంపై రాజీపడకపోవడం మన హక్కు అని .. ఎవరైనా ఇస్లాం గురించి తప్పుగా చూపిస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సినిమా తప్పుడు సందేశం పంపించడంతో పాటు శాంతికి భంగం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ సినిమాతో ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. పఠాన్‌లు ఎంతో గౌరవించబడే సమాజం అయితే వారిని చాలా తప్పుగా చిత్రీకరించారని అన్నారు.