Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..
- మైనర్ బాలికకు "ఫ్లయింగ్ కిస్"..
- నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష..
Mumbai Court: 9 ఏళ్ల క్రితం మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. బాలికకు ‘‘ఫ్లయింగ్ కిస్’’ ఇస్తూ వేధింపులకు గురిచేశాడు. ఆ సమయంలో బాలిక వయసు 16 ఏళ్లుగా కాగా, నిందితుడి వయసు 19 ఏల్లు. ప్రస్తుతం నిందితుడికి వివాహమై 3 నెలల పాప కూడా ఉంది. కోర్టు అతడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా విధించింది.
అసలు కేసు ఏంటి.?
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఈ సంఘటన జనవరి 31, 2017లో జరిగింది. హల్దీ కుంకుమ్ వేడక జరుగుతున్న సమయంలో నిందితుడు, బాలిక వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇది చూసిన పొరుగు వ్యక్తి ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పాడు. బాలికను తల్లి ప్రశ్నించగా.. కొన్ని రోజులుగా నిందితుడు తన వెంట పడుతున్నాడని, తాను ట్యూషన్ వెళ్లే సమయంలో ఒకసారి వెనక నుంచి వచ్చి, తన చేయి పట్టుకుని లాగాడని ఆమె వెల్లడించింది. భయంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఫిబ్రవరిలో ఈ విషయం బాలిక కుటుంబానికి తెలిసింది. నిందితుడిని బాలిక తల్లి తమ అమ్మాయికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే నిందితుడు బాలిక తల్లిదండ్రులను దుర్భాషలాడాడు. దీని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది.
విచారణ సమయంలో నిందితుడి తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. నిందితుడు డ్యాన్స్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ సైగ చేశాడు, అయితే బాలిక దీనిని తిరస్కరించిందని వెల్లడించారు. అయితే, దీని ద్వారా నిందితుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు అంగీకరించాడని కోర్టు పేర్కొంది. ఇది బాధితురాలి గౌరవాన్ని ఉల్లంఘించే లైంగిక వేధింపులే అని చెప్పింది. దీంతో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?