ఈరోజుల్లో పెద్ద పెద్ద కంపెనిలలో ఉద్యోగాలు చేసే వారికన్నా కూడా రోడ్డు పై తోపుడు బండి పెట్టుకొనే వాడే ఎక్కువగా సంపాదిస్తున్నాడు.. ఇది వాస్తవం.. ఆఫీస్ లలో పనిచేసేవారికి ట్యాక్స్ లు కటింగ్స్ పోగా మిగిలినవి చేతికివస్తాయి.. అదే వ్యాపారాలు చేసుకొనేవాళ్ళే లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. అనుకుంటున్నారు కదా.. దానికి ఓ రీజన్ ఉందండి..
అదేంటంటే.. ఓ వ్యక్తి ఆడి కారు పెట్టుకొని కూడా రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. రోజు ఆడి కారులో వస్తాడు.. రోడ్డు పక్కన టీ పెట్టి అమ్ముతాడు.. అది చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు.. అతను ఎందుకు అలా చేస్తున్నాడా అని తెగ బుర్రలు గోకుంటున్నారు.. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆడి కారులో వచ్చి ముంబైలోని లోఖండ్‌వాలా రోడ్డు మీద చాయ్ అమ్ముతున్నాడు. లక్షల రూపాయల విలువ చేసే కారులో వచ్చి చాయ్ అమ్మడమేంటని అతడిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అతడి ఐడియా బాగానే వర్కౌట్ అయింది. నిత్యం కాస్ట్లీ కస్టమర్లతో అతడి షాపు రద్దీగా ఉంటుంది..
వివరాల్లోకి వెళితే.. ఆ యువకుడి పేరు మన్ను శర్మ.. చాయ్ బిజినెస్ ను వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే ఎంతో ఖర్చు పెట్టి ఆడి కారును కొన్నాడు. ‘ఆన్ డ్రైవ్ టీ’ అనే పేరుతో ‘థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ’ అంటూ టీ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఓ చెట్టు కింద టీ స్టాల్ ఓపెన్ చేశాడు.. రోజు కారులో టీకి కావాల్సిన వస్తువులు తీసుకురావడం, అక్కడ టీ స్టాల్ సెటప్ చేయడం.. రాత్రి వరకు టీ అమ్మడం .. అనంతరం ఇంటికి అదే కారులో తిరిగి వెళ్లడం చేస్తాడు.. ఇతడి టీ రుచిగా ఉండటంతో రోజు రోజుకు కస్టమర్లు కూడా పెరుగుతున్నారు.. ఇతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..