Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కొడుకుకు 2 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవి రద్దు..
- మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కొడుకుకు 2 ఏళ్లు జైలు శిక్ష..
- ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ..
- ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్న అబ్బాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్నారీ కుమారుడు అబ్బాస్ అన్సారీని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఉత్తర్ ప్రదేశ్ మౌ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్‌కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, అతడి ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. 2022లో అధికారులను బెదిరిస్తూ ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీని కూడా దోషిగా తేల్చింది, ఇతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించింది.
Read Also: Pakistan Spy: ‘‘పాకిస్తాన్ సొంత ఇళ్లులా అనిపిస్తుంది’’.. గూఢచారిని పట్టించిన ఇంటర్వ్యూ..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఎన్డీయే మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(SBSP) ఎమ్మెల్యే అయిన అబ్బాస్ అన్సారీ ఇప్పుడు అసెంబ్లీ నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మౌ సదరన్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అబ్బాస్ అన్సారీ, మార్చి 3, 2022న పహర్‌పూర్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మౌ లో పనిచేస్తున్న ప్రభుత్వం అధికారులను బెదిరించారు. ‘‘అందరి లెక్క చూస్తాను, వారికి గుణపాఠం చెబుతా’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. “ఆరు నెలల పాటు ఎటువంటి బదిలీలు లేదా పోస్టింగ్‌లు జరగవని నేను అఖిలేష్ యాదవ్‌తో చెప్పాను. మొదట, అధికారుల లెక్కలు తేల్చిన తర్వాతే బదిలీలు ఉంటాయి’’ అని బెదిరించారు.
ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపిన ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జడ్జి కేపీ సింగ్ శనివారం అబ్బాస్‌ని దోషిగా నిర్ధారించారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తానని అబ్బాస్ అన్సారీ చెప్పారు. ప్రస్తుతం ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది. అబ్బాస్ అన్సారీ తండ్రి ముఖ్తార్ అన్సారీ 2024 మార్చిలో బందా జిల్లా జైలులో గుండెపోటుతో మరణించాడు. మౌ సదర్ స్థానం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2005 నుండి యుపి, పంజాబ్‌లలో జైలులో ఉన్నారు. ఆయనపై 60 కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!