Site icon NTV Telugu

Sanjay Raut: బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Raut

Sanjay Raut

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకు ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన బీజేపీలో విలీనం కావొచ్చని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లేకుండానే చర్చలు జరిగినట్లుగా చెప్పారు. చర్చలు జరిగాయని శరద్ పవార్ కూడా ధ్రువీకరించారని తెలిపారు. త్వరలోనే ఆ రెండు పార్టీలో బీజేపీలో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు.

‘‘ఎన్సీపీ వర్గాలు రెండూ విలీనం అవుతాయని నేను అనుకోను. కానీ అలా జరిగితే నేను సంతోషిస్తాను. ప్రఫుల్ పటేల్ చెబుతున్నదే అమిత్ షా చెబుతున్నది. రెండింటి విలీనం గురించి మీ దగ్గర ఏదైనా గట్టి సమాచారం ఉందా?. అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, బీజేపీ విలీనంపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్సీపీ బీజేపీలో విలీనం అవుతుంది. ఏక్‌నాథ్ షిండే పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

ఫిబ్రవరి 4న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. రెండు ఎన్‌సీసీ వర్గాల విలీనంపై చర్చలు అజిత్ పవార్-జయంత్ పాటిల్ మధ్య జరిగాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కాదని అన్నారు.

జనవరి 28 ఉదయం పూణె జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించారు. అనంతరం ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Exit mobile version