Global Survey : మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇటీవలి సర్వే ప్రకారం.. ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 56.6శాతం మందికి దాని గురించి తెలియదు. ఈ వైరస్ వరిసెల్లా-జోస్టర్. ఇది ఒకప్పుడు చికెన్‌పాక్స్‌కు కారణమైంది. ఇప్పుడు శరీరంలో క్రియారహితంగా ఉంది.…
చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటివి మంకీపాక్స్, చికెన్‌పాక్స్ రెండింటిలో సాధారణ లక్షణాలు కావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు సోకింది ఏ వైరస్ అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు వైరల్ వ్యాధుల లక్షణాలు రోగులలో వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉందని వైద్యులు వెల్లడించారు.
కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్‌కు బదులుగా చికెన్‌పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు.