చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటివి మంకీపాక్స్, చికెన్‌పాక్స్ రెండింటిలో సాధారణ లక్షణాలు కావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు సోకింది ఏ వైరస్ అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు వైరల్ వ్యాధుల లక్షణాలు రోగులలో వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉందని వైద్యులు వెల్లడించారు.