Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..
- నా కూతురు ‘‘లవ్ జిహాద్’’ బాధితురాలు..
- మధ్యప్రదేశ్ సీఎం సాయం కోరిన మోనాలిసా తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల, కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహంపై ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణలు వచ్చాయి. వీటిని కొత్త జంట తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై మోనాలిసా తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నారు. తన కుమార్తెను రాష్ట్రానికి తీసుకురావాలని శుక్రవారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌ను కోరారు.
మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన, సంచార ‘పార్ధి’ కమ్యూనిటీకి చెందిన మోనాలిసా భోంస్లే (18), బుధవారం నాడు కేరళలోని పూవార్ ప్రాంతం, అరుణమనూర్ వద్ద ఉన్న నైనార్ ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కేరళ ప్రభుత్వంలోని మంత్రులు కూడా హాజరయ్యారు. కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోసాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే కీలక ఆరోపణలు చేశారు. తన కుమార్తె ‘‘లవ్ జిహాద్’’ బాధితురాలిగా మారిందని అన్నారు. ముస్లిం యువకులు హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో ఆకర్షించి, వివాహం చేసుకుని మతం మార్చడాన్ని ‘‘లవ్ జిహాద్’’గా వ్యవహరిస్తుంటారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Iran: భారత్‌ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
“నా కుమార్తె దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. మోనాలిసాను సురక్షితంగా మధ్యప్రదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేలా చూడాలని నేను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను కోరుతున్నాను. ఫర్మాన్ ఖాన్ అనే ఒక ముస్లిం యువకుడు ఆమెను మోసపూరితంగా తన వలలో వేసుకున్నాడు. ఇది ‘లవ్ జిహాద్’ కేసు,” అని అన్నారు. తన కుమార్తె సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్ని్స్తోందని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుందని జైసింగ్ చెప్పారు.
ఇదిలా ఉంటే, మోసాలిసా ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఇది లవ్ జిహాద్ కాదని మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. తన నిర్ణయం ప్రకారమే వివాహం జరిగిందని వెల్లడించారు. తనపై వస్తున్న పుకార్లలో నిజం లేదని చెప్పారు. తన తల్లిదండ్రులు మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలనుకున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పింది.
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!