Site icon NTV Telugu

PM Modi: జంగిల్ రాజ్‌ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ

Modi1

Modi1

జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: Erika Kirk: ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి

‘‘జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో జరిగిన అభివృద్ధి రిపోర్ట్ కార్డ్ సున్నా. 1990 నుంచి 2005 వరకు దాదాపు 15 సంవత్సరాలు.ఈ జంగిల్ రాజ్ బీహార్‌ను నాశనం చేసింది. అప్పట్లో ప్రభుత్వాన్ని నడపడం పేరుతో మిమ్మల్ని దోచుకున్నారు. అందుకే నేను చెప్తున్నాను. ఫిగర్ సున్నాను గుర్తుంచుకోండి. బీహార్‌లో 15 సంవత్సరాల జంగిల్ రాజ్‌లో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్ల సంఖ్య కూడా సున్నా. ఎన్ని వైద్య కళాశాలలు నిర్మించబడ్డాయి జీరో. బీహార్‌కు ఒక్క ఐఐటీ కూడా రాలేదు. ఒక్క ఐఐఎం కూడా రాలేదు. ఒక తరం భవిష్యత్తును ఆర్జేడీ నాయకులు మ్రింగివేశారు’’ అని మోడీ ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడ్డ భారీ తుఫాన్.. 241 మంది మృతి

ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్‌ను అడవి రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నితీష్ కుమార్ అవిశ్రాంతంగా కృషి చేశారు. 2014లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీహార్ అభివృద్ధి కొత్త ఊపును తీసుకొచ్చింది. పాట్నాలో ఐఐటీ ప్రారంభించబడింది. బోధ్ గయలో ఐఐఎం ప్రారంభించబడింది. పాట్నాలో ఎయిమ్స్ ప్రారంభించబడింది. ఎయిమ్స్ దర్భంగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు బీహార్‌లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఐఐఐటి భాగల్పూర్‌లో కూడా ఉంది. బీహార్‌లో 4 కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా స్థాపించబడ్డాయి.’’ అని మోడీ పేర్కొన్నారు.

ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని.. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిజాయితీతో కట్టుబడి ఉందని చెప్పారు. చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తున్నామని.. కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ వ్యక్తులు చొరబాటుదారులను రక్షించేందుకు బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇందుకోసం అనేక రకాలైన అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Exit mobile version