Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
- మోడీతో సీఎం విజయ్ భేటీ
- ప్రధానంగా రెండు సమస్యలపై కీలక విజ్ఞప్తులు
- 20 నిమిషాల పాటు సాగిన కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీతో విజయ్ కీలక చర్చల జరిపారు. ఈ సందర్భంగా రెండు కీలక వినతలు సమర్పించారు. అలాగే తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ఇటీవల నెదర్లాండ్స్ నుంచి ప్రాచీన చోళుల కాలానికి చెందిన రాగి ఫలకాలను తిరిగి భారత్‌కు తీసుకురావడంపై ప్రధాని మోడీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మేకేదాటు ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు కావేరీ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కావేరీ జల వివాదం ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల ఆత్మకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర అనుమతి అవసరమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వవద్దని జల్ శక్తి మంత్రిత్వ శాఖకు సూచనలు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన DPRను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని ప్రకటించారు. తమిళనాడుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు లేదని వ్యాఖ్యానించడంతొ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.
అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ థాయ్’కు అనుమతి ఇవ్వాలని మరో కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గానం కలిసి ఉన్న సందర్భాల్లో ముందుగా పూర్తి స్థాయిలో ‘వందే మాతరం’ ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనవరిలో జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో DRDOకి చెందిన ‘సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్’ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ సభ్యుల మద్దతుతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!