Mobile Phone tracking system: ఫోన్ పోయిందా..? భయపడాల్సిన అవసరం లేదు.. మే 17న కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Phone tracking system: మీ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టమ్ ఇకపై భారతదేశం అంతటా అమలులోకి రానుంది. పోయిన ఫోన్‌ని ట్రాక్ చేసి బ్లాక్ చేసేందుకు కొత్త సిస్టమ్ అందుబాటులోకి రాబోతోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్(CDoT) అభివృద్ధి చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్( CEIR)’ వ్యవస్థను దేశం మొత్తం మే 17 నుంచి అమలు చేయనున్నట్లు తెలిసింది. అయితే సీడాట్ సీఈఓ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ధృవీకరించలేదు.
Read Also: Praveen Sood: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక టాప్ పోలీస్..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ప్రస్తుతం CEIR వ్యవస్థను ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిల్‌లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ త్రైమాసికంలో దేశం మొత్తం ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. సీడాట్ అన్ని టెలికాం నెట్వర్క్ లలో క్లోనింగ్ చేయబడిని మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసేలా ఫీచర్లు ఉన్నాయి.
భారతదేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో IMEI-15 అంకెల ప్రత్యేక ఐడెంటిటీ నెంబర్ ను ముందే బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నెట్వర్క్ ఈ నెంబర్ ను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఏదైనా అనధికారిక మొబైళ్లు తమ నెట్వర్క్ పరిధిలోకి వస్తే వెంటనే ఈ CEIR వ్యవస్థ ద్వారా గుర్తించగలుగుతాయి. ఈ వ్యవస్థ ద్వారా ఐఎంఈఐ నెంబర్ మొబైల్ నెంబర్లతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేయడంతో పాటు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశ ఉంది. అలాగే ఎవరైనా దొంగలిస్తే పోలీసులు గుర్తించడం సులభం అవుతుంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!