HD Revanna: సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం.. మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HD Revanna: సెక్స్ కుంభకోణం కేసులు కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి జేడీయూ నేత, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసు నమోదైంది. తాజాగా కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను దేవెగౌడ నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతని అరెస్ట్‌కు వ్యతిరేఖంగా రక్షణ కల్పించాలనే పిటిషన్‌ని తిరస్కరించిన తర్వాత అరెస్ట్ జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో ఏర్పాటు చేసిన సిట్ రేవణ్ణను అరెస్ట్ చేసింది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తన తల్లిని రేవణ్ణ, అతని సహాయకుడు కిడ్నాప్ చేశారని 20 ఏళ్ల యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రాజు అనే యువకుడి ఫిర్యాదు మేరకు రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. సెక్షన్ 364A (కిడ్నాప్) మరియు సెక్షన్ 365 (బలవంతంగా నిర్బంధించడం) కింద కేసు నమోదు చేయబడింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది. సదరు మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న సతీష్ ఆమెను రేవణ్ణ పిలుస్తున్నాడని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఏప్రిల్ 29న ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధిత మహిళ కుమారుడు తన తల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది.
ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం పెద్దగా మారడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ వీడియోలు బయటపడటంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి వెళ్లాడు. అతడిపై కర్ణాటక ప్రభుత్వం రెండు సార్లు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..