Meghalaya: హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్! అధికారులు ఏం తేల్చారంటే..!
- హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్!
- లోయలో భర్త మృతదేహం లభ్యం!
- కనిపించని భార్య సోనమ్ జాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేఘాలయలో తప్పిపోయిన హనీమూన్ జంట కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వారం క్రితం తప్పిపోయిన జంట ఆచూకీలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేహంపై ఉన్న గాయాలను చూసి ఇది హత్యకు అధికారులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టానికి తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి జంట ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. సమాచారం అందిన దగ్గర నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జంట కోసం వెతికారు. ప్రతికూల వాతావరణంలో కూడా అధికారులు అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు రియాట్ అర్లియాంగ్ దగ్గర లోతైన లోయలో రాజా రఘవంశీ మృతదేహాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. కానీ భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో సోనమ్ ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhu Bharati Act: నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు
రాజా రఘువంశీ మృతదేహాన్ని వీసావ్‌డాంగ్ పార్కింగ్ స్థలానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, బంధువులు.. అతని కుడి చేతిపై ఉన్న ‘రాజా’ అని పేరున్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అడియెల్ ఆర్. కింటాన్, స్వతంత్ర స్థానిక సాక్షుల సమక్షంలో అక్కడికక్కడే మెజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం రాజా రఘువంశీ హత్యకు గురైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భార్య సోనమ్ ఆచూకీ లభించకపోవడంతో మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మృతదేహం లభించిన స్థలం దగ్గర నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ తెల్ల చొక్కా.. పెంట్రా 40 మందుల స్ట్రిప్, వివో మొబైల్, ఎల్సీడీ స్క్రీన్ భాగం, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్టుమార్టం కోసం ప్రస్తుతం మృతదేహాన్ని షిల్లాంగ్‌లోని ఆస్పత్రికి తరలించారు. డెడ్‌బాడీని చూసిన దానిని బట్టి చూస్తే.. కచ్చితంగా రాజా రఘువంశీ హత్యకు గురైనట్లుగానే అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు కోసం అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..