Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తి రెడ్డి ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
భక్తి, ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ శివాలయం సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దేవుని పటాల సమక్షంలో నిర్వహించిన ముహూర్తపు కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
శివాలయం చిత్రంలో ఆచంట మహేష్, కాంచన దీప్తి రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఘర్షణ శ్రీనివాస్, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి నంది నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దరిపల్లి ప్రవీణ్ కుమార్, లెంకల అశోక్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని డ్రమ్స్ రాము అందిస్తుండగా.. నిహారిక చౌదరి కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివాలయం సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క