నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు తప్పిపోయాడు. తిరిగి వస్తాడని ఎదురుచూశారు. కానీ తిరిగి రాలేదు. 15 ఏళ్లు అయిపోయింది. దీంతో చనిపోయి ఉంటాడని భావించి ఆశలు వదులుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఈ సంఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
బల్దేవ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సుజన్‌పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామవాసి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడని భావించారు. కానీ తిరిగి రాకపోవడంతో చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా వెతికి.. వెతికి చేతులెత్తేశారు. జాడ కనిపెట్టలేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించి విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్‌మెంట్..
అయితే 3 రోజుల క్రితం రాజస్థాన్‌లోని బికనీర్‌లోని గౌరవ్ జైన్ కుటుంబం ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతని ఆచూకీ గుర్తించాలని కోరారు. ఆ వీడియో కాస్త హిమాచల్‌ప్రదేశ్‌లోని సుజన్‌పూర్‌లోని సప్నా కుమారికి చేరింది. ఈమె కూడా పలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆశ్చర్యకరంగా బల్దేవ్ కుమార్ కుటుంబ సభ్యులకు వీడియో చేరింది. దీంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకేనంటూ తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బికనీర్‌లో ఉన్న బల్దేవ్ కుమార్ దగ్గరకు బయల్దేరి వెళ్లిపోయారు. కన్న కొడుకును చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బల్దేవ్ కుమార్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సుజన్‌పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామానికి తీసుకొచ్చారు. చాలా గ్రాండ్‌గా డప్పులు, బాకాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక సోషల్ మీడియా ద్వారా తమ కొడుకును దగ్గరకు చేర్చిన సప్నా కుమారి, గౌరవ్ జైన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇక బల్దేవ్ కుమార్ ప్రస్తుతం మాజీ సైనికుడిగా ఉన్నారు.