ISRO: చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతదేశంలోని కోట్లాది మంది భారతీయులు సంబురాలు జరుపుకున్నారు. దేశంలోని ప్రజలే కాకుండా.. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంబురాలు నిర్వహించారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపచం వ్యాప్తంగా పలు దేశాలు ఇస్రో అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం దరువాత ఇక్రో ట్విట్టర్ ఎక్స్ లో చేసిన పోస్టుకు కోట్ల మంది రెస్సాన్స్ ఇచ్చారు. చంద్రుడికి దగ్గరకు చేరుకున్న చంద్రయాన్-3 ఇస్రోకి మెసేజ్ చేసినట్టుగా ఉన్న ఆ పోస్టు ప్రజలను ఆకర్షించింది.
Read Also: Board Exams: ఇంటర్ విద్యార్థులకు ఇకపై ఏటా రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్
చంద్రుడిపై విజయాలను తెలుసుకోవడం కోసం చంద్రయాన్-3 ప్రయోగంను ఇస్రో జులై 14వ తేదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 41 రోజుల తరువాత బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా ఇండియా ప్రపంచ పుటల్లో తన పేరును లిఖించుకుంది. ఇండియా కంటే చంద్రుడిపై అమెరికా, చైనా, సోవియట్ యూనియన్లు ఈ ఘటన సాధించాయి. అయితే చంద్రుడి దక్షిణ దృవంపై అడుగిడిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది. చంద్రయాన్-3 విజయవంతమైన తరువాత బుధవారం సాయంత్రం తరువాత ఇస్రో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విశేషాలు కోట్ల మంది హృదయాలను ఆకర్షించాయి. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన బుధవారం సాయంత్రం వరకూ ఇస్రో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విశేషాలు కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టాయి. సాంకేతిక అంశాల సమాహారంగా కాకుండా సరదాగా ఇస్రో చేసిన పోస్టులతో జనమంతా ఫిదా అయ్యారు. బుధవారం చంద్రయాన్-3 లక్ష్యాన్ని చేరుకున్నాక ట్విట్టర్ ‘ఎక్స్’లో ఇస్రో పెట్టిన పోస్టూ కోట్ల మందిని ఆకట్టుకుంది. ‘ఇండియా, నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. నీవు కూడా!’ అని ఇండియానుద్దేశించి చంద్రయాన్-3 మిషన్ అన్నట్లుగా ఇస్రో ట్వీట్ చేసింది. సోమవారం చంద్రయాన్-2 ఆర్బిటర్, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడినప్పుడు ‘వెల్‌కం బడ్డీ!’ అని పోస్టు చేసింది. దీనిని ఎక్స్‌లో 34 లక్షల మంది చూశారు. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయినప్పుడు ‘థాంక్స్ ఫర్ ద రైడ్, మేట్!’ అని ఇస్రో చేసిన పోస్టును 55 లక్షల మంది వీక్షించారు. ఇస్రో తన ప్రతి పోస్టులోనూ చందమామ, రాకెట్లు, శాటిలైట్ల వంటి ఎమోజీలను ఉంచింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో విక్రం, ప్రగ్యాన్ లాండింగ్‌కు కొన్ని గంటల ముందు ‘మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ శక్తిమంతంగా, ఉత్సుకతతో ఉందని ఇస్రో ట్వీట్ చేసింది. ల్యాండర్ దిగే సమయంలో ఇస్రో యూట్యూబ్ ఛానల్‌ను 77,53,737 మంది వీక్షించారు. ఇక దేశవ్యాప్తంగా తమ ఇళ్ల నుంచి కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని విక్షించిన విషయం తెలిసిందే.