Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ

  • జీ7 సదస్సులో మోదీ-మెలోనీ సరదా సంభాషణ వైరల్.
  • "మేమే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రసిద్ధ జంట" అని మెలోనీ వ్యాఖ్య.
  • మళ్లీ ట్రెండ్ అవుతున్న "మెలోడి" హ్యాష్‌ట్యాగ్.
Melodi

Melodi

Melodi: ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఇద్దరి సంభాషన వైరల్‌గా నిలిచింది. మరోసారి ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడిన సమయంలో ఇద్దరూ చేతులు కలుపుకుని పలుకరించుకున్నారు.

ఈ సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ అందర్ని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఇద్దరి ప్రజాదరణ గురించి మోడీ ప్రస్తావించగా, దానికి స్పందించిన మెలోనీ.. ‘అవును ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇటలీ పర్యటన సందర్భంలో ప్రధాని మోడీ, మెలోనికి ప్రసిద్ధ చాక్లెట్ టాఫీ ‘‘మెలోడీ’’ని గిఫ్ట్‌గా అందించారు. ఈ వీడియోను మెలోనీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ఇది తక్కువ కాలంలో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

×
×
Ad