Site icon NTV Telugu

Manipur violence: మణిపూర్ సర్కార్కు మైటీల డెడ్లైన్.. వారిని 24 గంట్లలో శిక్షించాలని డిమాండ్‌

Manipur

Manipur

Manipur violence: మణిపూర్‌ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుంది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్‌ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు. వీరిలో మహిళలు ముగ్గురు ఉండగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి ఉండటం తీవ్ర కలకలం రేపుతుంది.

Read Also: Kishan Reddy: ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదు..

ఈ ఘటన స్థానికులని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు ఆందోళనకు దిగారు. రోడ్లపై ఫర్నీచర్లను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను బంద్ చేసి కర్ఫ్యూ విధించారు.

Read Also: Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?

అలాగే, ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మైటీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా తెలిపారు. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందేంత వరకు వారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల అసంతృప్తిని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అన్ని సాయుధ సమూహాలపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు, సైనిక అణిచివేత చర్యలను ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం.. మిలిటెంట్లపై వెంటనే సైనిక చర్య తీసుకోవాలని కోరారు.

Read Also: Haryana: పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ.. భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చి..

దీంతో పాటు AFSPAని రద్దు చేయాలని మైటీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా మా డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ సర్కార్ విజ్ఞప్తి చేసింది.

Exit mobile version