Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు.