Mehbooba Mufti: ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని ‘‘వేధించవద్దు’’.. ఉగ్రవాదులకు ముఫ్తీ మద్దతు ఇస్తుందా.?
- ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని వేధించవద్దు..
- ఉగ్రవాదంపై మెహబూబా ముఫ్తీ సున్నిత వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు డాక్టర్లుగా ఉంటూనే ఉగ్రవాదానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ల తల్లిదండ్రుల్ని విచారణ పేరుతో ‘‘వేధించవద్దు’’ అని అన్నారు.
గతంలో కూడా ముఫ్తీ ఇలా నిందితులకు మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఆమె ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విమర్శిస్తూ మాట్లాడారు. పాకిస్తాన్‌తో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనిక కేంద్రీకృత విధానాన్ని విడిచిపెట్టాలని కోరారు. తాజాగా, మరోసారి ఢిల్లీ ఉగ్రదాడిపై కూడా ఇలాగే తన సున్నిత వైఖరిని చూపించారు.
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
Read Also: Hyderabad: రెడ్ లైట్ ఏరియాగా మారిన శ్రీశైలం హైవే? పట్టించుకోని పోలీసులు..!
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందిస్తూ.. మృతులకు సంతాపాన్ని వ్యక్తి చేశారు. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితులు దోషులుగా తేలితే తప్పా వారిపై దుర్భాషలాడకూడదని, ఇది వారి కుటుంబాలను బాధపెడుతుందని ఆమె అన్నారు. శ్రీనగర్ విలేకరుల సమావేశంలో బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై న్యాయపరమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
‘‘ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లను నేను ఖండిస్తున్నాను. మన విద్యావంతులైన వైద్యులు బాధపడుతున్నారు. ఢిల్లీ పేలుడుపై పూర్తి , న్యాయమైన దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ దాడిలో వైద్యులు ప్రమేయం ఉంటే, అది మనందరికీ చాలా హానికరం. అరెస్టయిన డాక్టర్ల తల్లిదండ్రుల్ని వేధించవద్దు. వారి ప్రమేయం లేదు. ఘటనలో పాల్గొన్న వారిని శిక్షించాలి. కానీ అమాయకులనను వేధించవద్దు’’ అని ముఫ్తీ అన్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా భద్రతా , దర్యాప్తు సంస్థల నుండి అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులు NIA, NSG, IB , స్థానిక పోలీసులతో కలిసి 500 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సోదాలను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్‌పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్‌లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!