300 Flights Delayed: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం (IGI) లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా 300కి పైగా విమానాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, దేశంలోనే అత్యంత రద్దీగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రతిరోజూ 1,500కి పైగా విమాన రాకపోకలు కొనసాగుతాయి. కానీ, గురువారం సాయంత్రం నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. శుక్రవారం కూడా అదే సమస్య కొనసాగుతుంది. దీని వలన విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఇక, సమయానికి గమ్యస్థానాలకు చేరుకోకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులను ప్యాసింజర్లు కోరుతున్నారు.
Read Also: Nimmala Rama Naidu: 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం!
కాగా, ప్రస్తుతం 300లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. అలాగే టెక్నికల్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో గల ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య కారణంగా రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తాయని ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ఇప్పటికే ప్రకటిస్తూ.. ప్రయాణికుల అంతరాయానికి చింతిస్తున్నాం.. మీ సహనానికి ధన్యవాదాలు తెలిపింది. వీలైనంత త్వరగా తగినంత సహాయం చేసేందుకు క్యాబిన్ సిబ్బంది, ఆన్-గ్రౌండ్ సిబ్బంది కృషి చేస్తారని చెప్పుకొచ్చాయి.
Attention to all flyers! https://t.co/gVveGYaGyy
— Delhi Airport (@DelhiAirport) November 7, 2025