Mangalyaan Life ended: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళయాన్ జీవితం ముగిసింది. అతి తక్కవ బడ్జెట్ లో హాలీవుడ్ సినిమా ‘ గ్రావిటీ’ కన్నా తక్కువ బడ్జెట్ తో మార్స్ ఆర్బిటార్ మిషన్( ఎంఓఎం)ను రూపొందించి, విజయవంతంగా అంగారక గ్రహం వరకు తీసుకెళ్లడం ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచింది. ప్రస్తుతం మార్స్ ఆర్బిటార్ గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోల్పోయిందని.. ఇకపై దానితో సంబంధాలు కొనసాగించే అవకాశం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
మంగళయాన్ ప్రయోగించే సమయంలో కేవలం ఆరు నెలల జీవితకాలానికే ఇస్రో ప్రయోగించింది. అయితే అనూహ్యంగా స్పేస్ క్రాప్ట్ ఎనిమిదేళ్లు సేవలు అందించింది. మామ్ లో ఇంధనం నిండుకోవడం, బ్యాటరీలు డిశ్చార్జ్ అవ్వడంతో ఇకపై పనిచేయలేని స్థితికి చేరింది. మార్స్ కక్ష్యలో నిర్విరామంగా ఎనిమిదేళ్లు పరిభ్రమించింది మామ్. అంగారక గ్రహంపై, సూర్యుడి కరోనాపై విలువైన సమాచారాన్ని అందించింది. ఎప్రిల్ 2022లో ఏర్పడే సుదీర్ఘ గ్రహనం కారణంగా గ్రౌండ్ స్టేషన్ తో సంబధాలను కోల్పోయింది. మామ్ లో కక్ష్యలో విన్యాసాలు చేసేందుకు కావాల్సిన ఇంధనం అయిపోయిందని.. దీంతో నిరంతర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఎత్తును సాధించలేమని ఇస్రో తెలిపింది.
Read Also: Actor Nani: దసరాకు ధూమ్ ధామ్ చేస్తున్న హీరో నాని
నవంబర్5,2013న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించిన మంగళ్ యాన్ 300 రోజుల పాటు విశ్వంలో ప్రయాణించి సెప్టెంబర్ 24న మార్స్ కక్ష్యలో చేరింది. దీనిలో ఐదు సైంటిఫిక్ పరికరాలను అమర్చారు. మార్స్ ఉపరితల లక్షణాలు, నిర్మాణం, మార్స్ వాతావరణ, ఎక్సోస్పియర్ పై ఎంతో సమాచారాన్ని అందించింది మంగళయాన్. నాసా, చైనీస్ అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా తొలి ప్రయత్నంలో అంగారకుడి కక్ష్యలో తమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో విఫలం అయ్యాయి. కానీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది.
మంగళయాన్ సమయంలోనే నాసా మావెల్ స్పేస్ క్రాప్ట్ ను ప్రయోగించింది. అయితే నాసా దగ్గర శక్తివంతమైన రాకెట్ ఉండటంతో.. నేరుగా అంగారకుడి మార్గంలో ప్రవేశపెట్టింది. అయితే భారత్ మాత్రం భూ కక్ష్యలోనే మార్స్ ఆర్బిటార్ ను తిప్పించి.. మార్స్ దగ్గరకు వెళ్లేందుకు కావాాల్సిన శక్తిని సంపాదించిన తర్వాత అంగారకుడి మార్గంలోకి ప్రవేశపెట్టారు. దీంతో నాసా మావెల్ ముందుగా అంగారకుడి కక్ష్యలో చేరిన తర్వాత.. మంగళయాన్ తరువాత చేరుకుంది.