Actor Nani: దసరాకు ధూమ్ ధామ్ చేస్తున్న హీరో నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Nani: నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పుడు దసరా సందర్భంగా హీరో నాని తన అభిమానుల కోసం ఫెస్టివల్ గిఫ్ట్ ఇచ్చారు. తన తాజా చిత్రంలోని ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని ఇంతకుముందు చూడని రేంజ్ లో కనిపిస్తారు. ఈ సినిమా నుంచి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఊర మాస్ స్టెప్పులతో నాని అదరగొట్టాడు. ఈ సాంగ్ ను మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాని లుక్ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది. నాని తొలిసారి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. నేచురల్ స్టార్ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇదే తొలిచిత్రం.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Read Also: Krithi Shetty : చీరకట్టులో కృతశెట్టి అరాచకం.. కుర్రోళ్లకు జ్వరం వస్తుందేమో..
ఈ సినిమాలో సముద్రఖని, సాయికుమార్, జరీనా వహబ్ లాంటి నటులు ప్రధాన పాత్రంలు పోషిస్తున్నారు. దసరా సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అచ్చమైన తెలుగు యాసలో నాని డైలగులు ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతిని కళ్లకుకట్టినట్లు చూపించారు దర్శకుడు శ్రీకాంత్.
అయితే ముందుగా చెప్పిన సమయానికి సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే ‘కొంచెం ఆలస్యం.. జర్ర ఓపిక పట్టండి. ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ వస్తుంది..’ అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఆ తరువాత ఇగ షురూ చెయుండ్రి అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న దసరా మూవీ రిలీజ్ కానుంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!