పహల్గామ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చారు. హర్యానాలోని కర్నాల్‌లో వినయ్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ కళ్లు చెమర్చాయి.
పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఓ నవ జంట జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే కన్నీళ్లను మిగిల్చింది. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే భర్త చనిపోవడంతో నవ వధువు గుండెలు పగిలేలా రోధించింది. హనీమూన్ కోసం వెళితే ప్రాణాలే పోయాయి. మృతదేహాన్ని ఇంటికి చేర్చారు అధికారులు. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు పలికింది. “జై హింద్”…
పహల్గామ్ ఉగ్ర దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్(26) ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. 5 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా.. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.