Madhya Pradesh: అతిక్లిష్ఠ మైన ఆపరేషన్ లో క్రానియోటమీ ఆపరేషన్ ఒకటి. ఈ శస్త్రచికిత్సలో శస్త్రచికిత్స జరిగే సమయంలో పేషంట్ మేలుకొని స్పృహలోనే ఉండాలి. ఎందుకంటే శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో పేషంట్ మేలుకొని ఉన్నప్పుడే మెదడు పనితీరును పర్యవేక్షించడానికి వీలు ఉంటుంది. అయితే ఇదే పరిస్థితి ఓ యువకుడికి ఎదురైంది. ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్ జరుగుతున్న ఆ యువకుడు భయపడ లేదు. డాక్టర్లకు సహకరిస్తూ ఆపరేషన్ థియేటర్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జరిగింది. వివారాలోలోకి వెళ్తే.. ఎయిమ్స్ లో వైద్యులు ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆ యువకుడికి పరిస్థితిని వివరించారు. దీనితో ఆ యువకుడు తనకు సంగీత వాయిద్యాలు ఏర్పాటు చేయమని కోరగా ఆ వైద్యులు ఆపరేషన్ థీయేటర్ లో సింథసైజర్ ను ఏర్పాటు చేశారు.
Read also:Skanda: బాగోలేదంటూనే తెగ చూస్తున్నారు కదరా!
ఆ పేషంట్ ఆ సింథసైజర్ పైన మెలోడీ పాటలు ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. కాగా వైద్యులు విజయవంతంగా ఆ పేషెంట్ బ్రెయిన్ లోని కణితను తొలిగించారు. కాగా ఆ యువకుడి ధైర్యానికి వైద్యులు అభినందలు జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ లో పాల్గొన్న న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ రాజ్ మాట్లాడుతూ.. పేషెంట్ ఆపరేషన్ జరిగే సమయంలో భయపడకుండా తనకు ఇష్టమైన మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఆపరేషన్ జరిగినంత సమయం స్పృహలో ఉండి డాక్టర్లకు సహకరించారు. దీనితో మేము అతని బ్రెయిన్లోని కణితను విజయవంతంగా తొలిగించగలిగాము అని పేర్కొన్నారు.