Skanda has become the highest-viewed Tollywood film in the first 24 hours on Disney+ Hotstar in 2023: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన “స్కంద” సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో “స్కంద”, దాని దర్శకుడు బోయపాటిపై OTT ప్లాట్‌ఫారమ్ ఆడియన్స్ తీవ్రమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బోయపాటిపై మీమ్స్, నవ్వించే పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. బోయపాటి క్రియేట్ చేసిన సీన్లు ఎంత హాస్యాస్పదంగా, లాజిక్ లెస్ గా ఉంటాయో చుడండి అంటూ చాలా మంది ఎత్తిచూపుతున్నారు. సీఎం ఇంట్లో హీరో దిగి సీఎం కూతుర్ని కిడ్నాప్ చేసే స్టుపిడ్ సీన్ చూసి నవ్వుకుంటున్నారు.
Rakul Preeth Singh: ఓమైగాడ్ అనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్ ఫొటోలు
మొదటి సీన్‌లో చనిపోయిన వ్యక్తి తర్వాత సీక్వెన్స్‌లో మళ్లీ కనిపించడం వంటి ఎడిటింగ్ లోపాలను సైతం కొందరు పాయింట్ అవుట్ చేసి హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఇంత జరుగుతుంటే ఈ సినిమాలో 2023లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో మొదటి 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. సినిమా ఎంత చెత్తగా ఉన్నా బోయపాటి శ్రీను సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్-బ్రేకింగ్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అదే ట్రెండ్ హాట్‌స్టార్‌లో కూడా ప్రతిబింబిస్తుంది. అంతేఒకరకంగా సినిమాను ట్రోల్ చేస్తూనే మరోపక్క ఒక రేంజ్ లో సినిమాను చూసేస్తన్నారు ఆడియన్స్. సో అలా ఈ సినిమా ఎవరూ ఊహించని వ్యూయర్ షిప్ సాధిస్తోంది.