Madhya Pradesh: అతిక్లిష్ఠ మైన ఆపరేషన్ లో క్రానియోటమీ ఆపరేషన్ ఒకటి. ఈ శస్త్రచికిత్సలో శస్త్రచికిత్స జరిగే సమయంలో పేషంట్ మేలుకొని స్పృహలోనే ఉండాలి. ఎందుకంటే శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో పేషంట్ మేలుకొని ఉన్నప్పుడే మెదడు పనితీరును పర్యవేక్షించడానికి వీలు ఉంటుంది. అయితే ఇదే పరిస్థితి ఓ యువకుడికి ఎదురైంది. ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్ జరుగుతున్న ఆ యువకుడు భయపడ లేదు. డాక్టర్లకు సహకరిస్తూ ఆపరేషన్ థియేటర్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు.…