Supreme Court: నా భార్య ఆడది కాదు.. కోర్టులో భర్త పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను వివాహం చేసుకున్న మహిళ ఆడది కాదంటూ ఓ భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మెడికల్ రిపోర్టు ప్రకారం ఆమె ఆడది కాదని, తాను మోసపోయానని, ఆమె నుండి విడాకులు ఇప్పించాలంటూ పిటిషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 2016లో తమకు వివాహం అయిందని, ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్లో భర్త పేర్కొన్నాడు.
ఆమెతో సన్నిహితంగా మెలిగే సమయంలో తనకు దూరంగా ఉండటంతో అనుమానం వచ్చిందని.. దీంతో ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లగా ఇంపర్‌ఫోరెట్ హైమన్ (చిన్నపాటి పురుషాంగం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని సదరు వ్యక్తి పిటిషన్లో కోర్టుకు నివేదించాడు. ఆ పురుషాంగాన్ని ఆపరేషన్‌లో తొలగించవచ్చునని, అయితే దాదాపు పిల్లలు పుట్టరని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపాడు. దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి కుమార్తెను తిరిగి తీసుకెళ్లాలని చెప్పానని.. అయితే తన కుమార్తెతో కాపురం చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా మామ బెదిరించినట్లు ఆరోపించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులు కోరుతూ మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించినట్లు వివరించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కేవలం మౌఖిక సాక్ష్యం ఆధారంగా.. మెడికల్ సాక్ష్యం లేకుండా చీటింగ్ చేశారని చెప్పడం సాధ్యపడదంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమెలో మహిళలకు ఉండాల్సిన లక్షణాలు, అవయవాలు అన్నీ ఉన్నందున ఇందులో మోసమేమీ లేదని కోర్టు అభిప్రాయపడింది.
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఐపీసీ ప్రకారం భార్య పురుషుడిగా మారినందుకుగానూ ఆమెపై సెక్షన్ 420 కింద క్రిమినల్ నేరం చేసినట్లు పరిగణించాలని భర్త తరఫు లాయర్ ఎన్‌కె మోదీ ధర్మాసనానికి తెలియజేశారు. ఆమె మహిళ కాదు కాబట్టి బాధితుడికి కచ్చితంగా అన్యాయం జరిగిందన్నారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య కాదని, ఆమెకు తన జననాంగాల గురించి తెలిసి తన క్లయింట్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్లు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ కేసుపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భార్య, ఆమె తండ్రి, మధ్యప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!