Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ మరియు జస్టిస్ జి బసవరాజా ధర్మాసనం, దీన్ని మరణశిక్ష విధించాల్సిన అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొంది. నిందితుడి క్రూరత్వానికి దిగ్భ్రాంతికి గురైనట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు పిల్లలపై దాడి చేయడం, వారిని నరికివేయడం, రక్తంతో ఉన్న కత్తిని బయటకు తీసుకువచ్చి వేశ్యను చంపానని ప్రకటించడం, మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడిని మరణించే వరకు ఉరితీయాలని, అంతకుముందు బళ్లారి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి, ఉరి శిక్షను ధృవీకరించింది.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
- Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
Read Also:Pakistan: హిందువుల పరిస్థితి ఇంతే.. బాలిక కిడ్నాప్, మతమార్పిడి.. కన్నవారితో పంపేందుకు కోర్టు నిరాకరణ
కేసు వివరాలు ఇవే:
బళ్లారిలోని హోసపేటలోని కంప్లిలోని కెంచనగుడ్డ హళ్లికి చెందిన నిందితుడు బైలూరు తిప్పయ్య అనే కూలీ తన భార్యకు 12 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవ పడుతుండే వాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరు మాత్రమే తన సంతానం అని తిప్పయ్య ప్రకటించాడు. 2017 ఫిబ్రవరి 25న భార్య పక్కీరమ్మపై చాపర్‌తో దాడి చేశాడు. కోడలు గంగమ్మ, అతని పిల్లలు పవిత్ర, నాగరాజ్, రాజప్పపై కూడా దాడి చేశాడు. ఐదుగురు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచారు.
బళ్లారి సెషన్స్ కోర్టు 36 మంది సాక్షులను విచారించి తిప్పయ్యను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత ఈ రోజు కర్ణాటక హైకోర్టు కూడా ఇదే తీర్పును వెలవరించింది. ఈ హత్యకాండలో ప్రాణాలతో బయటపడిన ఏకైక చిన్నారి రాజేశ్వరికి పరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..