Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- సహనం కోల్పోయిన మమతా బెనర్జీ
- ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ సందర్భంగా జరిగిన గందరగోళంలో మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై టీఎంసీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
బారుయిపూర్‌లో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా టీఎంసీ విద్యార్థి, యువజన విభాగాలు బుధవారం కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాయి. కలకత్తా హైకోర్టు అనుమతితో బాలిగంజ్ ఫారి నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ముగిసిన అనంతరం అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో గాయపడిన పలువురు టీఎంసీ కార్యకర్తలను, మహిళా కార్యకర్తలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే సమయంలో దారి కల్పించేందుకు మమతా బెనర్జీ స్వయంగా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరడంతో తోపులాట చోటుచేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోలో మమతా బెనర్జీ తనకు అత్యంత సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి వైపు చేయి ఎత్తినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆ వ్యక్తిని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లగా.. మమత ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు దారి కల్పించే క్రమంలో ఏర్పడిన గందరగోళంలో అనుకోకుండా ఈ ఘటన జరిగి ఉండవచ్చని సమాచారం.
అయితే వైరల్ అవుతున్న వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. అలాగే మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తను కొట్టారా? లేక గందరగోళంలో అనుకోకుండా జరిగిందా? అనే విషయంపై కూడా అధికారిక స్పష్టత రాలేదు. టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Mamata Banerjee has completely lost her mental balance after losing elections!
Mamata Banerjee Hits Multiple People belonging to her own party during Protest march today. pic.twitter.com/9QR2C524b7
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) July 8, 2026
Former CM Mamata Banerjee is hitting her own supporters.
She was known for her street protests.
Now she has literally become a street fighter. pic.twitter.com/9a4ZTF2sLE
— Rakesh Singh राकेश सिंह 🇮🇳 রাকেশ সিং (@RakeshSinghKol) July 8, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!