Mamata Banerjee: అభిషేక్‌పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
- సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై దాడి.
- బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.
- "పాలకులే హంతకులుగా మారారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు.
- దాడి వెనుక బీజేపీ ఉందని అభిషేక్ ఆరోపణ.
- స్థానికుల ఆగ్రహమే కారణమని బీజేపీ కౌంటర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సోనార్‌పూర్‌లో మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో శనివారం ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాలకులు హంతకులుగా మారారు’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.
అభిషేక్ దాడిపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా మమతతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చేతులు కలిపాయి. ప్రముఖ ఎంపీకి పోలీసు భద్రత లేకపోవడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఎక్స్‌లో మమత స్పందిస్తూ.. ‘‘పాలకులే ఇప్పుడు హంతకులుగా మారారు. ఈ చర్యకు బీజేపీ సిగ్గుపడాలి.’’ అని రాశారు. మరోవైపు తనపై బీజేపీ వాళ్లే దాడికి పాల్పడ్డారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ దాడిని కక్షపూరిత రాజకీయంగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం విధ్వేష రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేయడం లేదని అన్నారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా స్పందించింది. ఇది స్థానిక ప్రజలు చేసిన దాడి అని, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఎన్నిలక సమయంలో అభిషేక్ బెనర్జీ బహిరంగంగా బీజేపీ కార్యకర్తల్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా సవాల్ చేశారని అన్నారు. సీఎం సువేందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదే పదే దాడులు జరిగాయని, దీని వెనక అభిషేక్ నెట్వర్క్ ఉందని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. అహంకారం, ఏకపక్ష భావజాలం ఎక్కువ కాలం నిలువదని టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
बंगाल में तृणमूल कांग्रेस के महत्वपूर्ण नेता श्री अभिषेक बनर्जी जी के ऊपर जानलेवा हमला करवाकर बंगाल की अराजक भाजपा सरकार ने साबित कर दिया है कि भाजपा नफ़रत भरी नकारात्मक हिंसक राजनीति के सिवा और कुछ नहीं कर सकती है। इतने संवेदनशील वातावरण में भी पुलिस की व्यवस्था न होना एक बड़ी…
— Akhilesh Yadav (@yadavakhilesh) May 30, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?