Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mamata Banerjee Opposing Op Sindoor Waqf Act To Appease Vote Bank Amit Shah

Amit Shah: ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతాబెనర్జీ ఆరాటం.. ‘‘సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’పై వ్యతిరేకత..

Published Date :June 1, 2025 , 5:04 pm
By BV Reddy
  • ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతా బెనర్జీ ప్రయత్నం..
  • అందుకే ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ చట్టంపై వ్యతిరేకత..
  • బంగ్లాదేశీ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న టీఎంసీ..
  • మమతపై విరుచుకుపడిన అమిత్ షా..
Amit Shah: ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతాబెనర్జీ ఆరాటం.. ‘‘సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’పై వ్యతిరేకత..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి మమతా ‘‘ఆపరేషన్ సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల, ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లు రాష్ట్ర స్పాన్సర్ చేసిందని అన్నారు. ‘‘ ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా దీదీ ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించారు. అలా చేయడం ద్వారా, ఆమె ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులను అవమానిస్తున్నారు. 2026 (అసెంబ్లీ ఎన్నికలు)లో, ఆపరేషన్ సిందూర్‌ను విమర్శించినందుకు రాష్ట్ర మహిళలు మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పుతారు’’ అని అమిత్ షా చెప్పారు.

Read Also: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..

ఏప్రిల్ లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో టీఎంసీ నాయకులు పాల్గొన్నారని, అల్లర్ల సమయంలో బీఎస్ఎఫ్‌ని మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరినప్పటికీ, హింసను కొనసాగించేందుకే టీఎంసీ ప్రభుత్వం దానికి అనుమతించలేదు అని అమిత్ షా ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు టీఎంసీ సహాయపడుతుందని చెప్పారు.

‘‘మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల కోసం బెంగాల్ సరిహద్దులను తెరిచారు. ఆమె చొరబాట్లను ఎప్పటికీ ఆపలేరు, బిజెపి మాత్రమే దీన్ని చేయగలదు’’ అని అన్నారు. బీఎస్ఎఫ్ చొరబాట్లను ఆపలేకపోతుందని ఇటీవల టీఎంసీ విమర్శించిన నేపథ్యంలో, మమతా బెనర్జీ సర్కార్ బీఎస్ఎఫ్‌కి అవసరమైన భూమి ఇవ్వడం లేదని అమిత్ షా అన్నారు. తమకు భూమి ఇస్తే చొరబాట్లను ఆపేస్తామని, కానీ మమతా బెనర్జీ దీనికి ఒప్పుకోదని, అధికారంలో ఉండేందుకు చొరబాట్లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Mamata Banerjee
  • murshidabad violence
  • Operation Sindoor
  • Waqf Act

తాజావార్తలు

  • Jurala Project : ఎండిన జూరాల.. నీళ్లు లేక విలవిల.. పాలమూరు ఆయకట్టుకు తప్పని జలకష్టం.!

  • Lava Bold N2 Lite: 5,000mAh బ్యాటరీ, 13MP కెమెరాతో.. లావా బోల్డ్ N2 లైట్ విడుదల.. తక్కువ ధరకే

  • Prabhas: వెకేషన్‌కు వెళ్లిన డార్లింగ్.. ఎక్కడికో గెస్ చేయండి!

  • PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం.. పశ్చిమాసియాపై చర్చించే అవకాశం

  • Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions