Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..

  • మమత కోరుకుంటే నా సీటు ఇస్తా..
  • హుయాయున్ కబీర్ బంపర్ ఆఫర్..
West Bengal

West Bengal

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు. 58 మంది ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీకి మద్దతు తెలిపారు. మమతా నిర్ణయించిన వ్యక్తిని కాదని, రీటబ్రత ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. మరోవైపు, మెజారిటీ ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ఓడిపోయిన ఆమెను, తన స్థానమైన ముర్షిదాబాద్‌లోని రిజినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఏజేయూపీ అధినేత హుయాయున్ కబీర్ ఆఫర్ చేశారు. మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ.. టీఎంసీ ప్రస్తుతం అత్యంత బలహీన స్థితిలో ఉందని అన్నారు. రీటబ్రత, సందీపన్‌లు మమతకు ద్రోహం చేసినట్లు చెప్పారు. మమత పార్లమెంటరీ రాజకీయాల్లో కొనసాగాలని, అందుకుే తాను ఆమెకు రెజినగర్ స్థానాన్ని ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

×
×
Ad

ఒకవేళ మమత కోరితే, తాను తన కొడుకును నిలబెట్టాలనుకున్న రాజ్‌నగర్ సీటును కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హుమాయున్ చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితికి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణమని ఆరోపించారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న హుయాయున్ ఎన్నికల ముందు టీఎంసీ నుంచి విడిపోయే ఆమ్ జనతా ఉన్నయన్(ఏజేయూపీ) పార్టీని స్థాపించారు. ఆయన ఎన్నికల్లో రాజ్‌నగర్, నౌడా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు.